63' శాతం ఫిట్‌మెంట్‌తో తక్షణమే పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. అలాగే ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నట్లుగా కాంట్రిబ్యూటరీ పింఛను విధానాన్ని రద్దు చేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని కూడా డిమాండ్ చేసింది. ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ మేరకు తీర్మానాలను ఆమోదించింది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను వెంటనే క్రమబద్ధీకరించాలని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన ఎన్నికల ప్రచారంలో వాగ్ధానం చేసిన మేరకు ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితిని 61 సంవత్సరాలకు పెంచాలని, కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో 20 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని, కొత్త జిల్లాలు, మండలాలకు వెంటనే కేడర్ స్ట్రెంత్‌ను మంజూరు చేయాలని, ఉపాధ్యాయ ఉమ్మడి సర్వీస్ రూల్స్‌ను తక్షణమే అమలు చేయాలని, ఎటువంటి ప్రీమియం లేకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని, వైద్య విధాన పరిషత్తును తక్షణమే డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌లో విలీనం చేయాలని, ఉద్యోగులపై పని భారం పెరిగిన శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.
Telangana state government employees news,Telangana state government employees latest flash news,PRC news Telangana state,
0 Comments